WGL: రాయపర్తి మండలం కొండూరు చెందిన రైతు రామారపు సంజీవ (40) వ్యవసాయ అప్పుల బాధతో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వ్యవసాయ పెట్టుబడులు, ట్రాక్టర్ కొనుగోలు కోసం సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు కావడంతో మనోవేదనకు గురై గురువారం పురుగుల మందు సేవించాడు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
వ్యవసాయ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య!


