SRD: పటాన్‌చెరుకు చెందిన పెద్దబోయిన యాదయ్య (71) ఈ నెల 25న సా. 4 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన సమయంలో తెలుపు రంగు పంచ, షర్ట్ ధరించి ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
పటాన్చెరులో వృద్ధుడి అదృశ్యం


