హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికలాంగుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం'

MDK: చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జెండాను జిల్లా అధ్యక్షుడు బాచుపల్లి పాండు ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు రెడ్డి గోపాల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాండు మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన కోరికల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు.