MDK: పోతిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను జలాల్‌పూర్‌కు చెందిన శ్రీను, పోతిరెడ్డిపల్లికి చెందిన సులోచనగా గుర్తించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించాక, మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారం
బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు


