హైదరాబాద్: 28°C
వ్యాపారం

టీవీఎస్ మోటార్స్ కొత్త సీఈవోగా పేమాన్

టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త డైరెక్టర్, సీఈవోగా పేమాన్ కార్గర్‌ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నియామకం వచ్చే ఏడాది జనవరి 27 నుంచి అమల్లోకి రానుంది. అప్పటి వరకు ప్రస్తుత సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తన పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న పేమాన్ నాయకత్వంలో కంపెనీ మరింత వృద్ధి సాధించనుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.