హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం

KNR: రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పందిళ్ల నుంచి హుస్నాబాద్ బస్‌స్టేషన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రికి పలువురు మహిళలు రాఖీలు కట్టారు. పండుగ రోజున సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను మంత్రి అభినందించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు రూ.12 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు.