HNK: హన్మకొండ కనకదుర్గ కాలనీలోని నివాసంలో ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి శుక్రవారం రాఖీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలపగా, వారు మిఠాయిలు తినిపించారు. చిన్నారులకు ప్రేమ, ప్రోత్సాహం అందించాలని వారు కోరారు.
తెలంగాణ
మానసిక దివ్యాంగ చిన్నారులతో రాఖీ వేడుకలు


