HYD: నగరంలోని ఉప్పుగూడ పరిధిలోని తానాజీ నగర్‌లో వాటర్ పైపులైన్ మరమ్మతుల కోసం వాటర్ వర్క్స్ అధికారులు పెద్ద గుంత తవ్వారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో తానాజీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద తవ్విన గుంతను కూడా ఇంకా పూడ్చలేదు. మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పైపులైన్ పనులతో వాహనదారులకు అవస్థలు


