హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన బాసు హనుమంతు

GDWL: గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామంలో మేడికొండ ఆంజనేయులు కుమార్తె అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గద్వాల్ బీఆర్‌ఎస్ ఇంఛార్జి బాసు హనుమంతు నాయుడు వారి నివాసానికి వెళ్లి మృతురాలి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్థులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.