హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆరా..!

MNCL: జిల్లాలో నిరంతరాయంగా తాగునీరు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఇవాళ చెన్నూర్‌లో అమృత్ 2.0 నీటి ట్యాంక్, పైప్‌లైన్, 100 పడకల ఆసుపత్రి, గిరిజన పాఠశాల పనులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. అలాగే, తహసీల్దార్ ఆఫీసుల్లో ఓటరు జాబితా, భూముల రీ సర్వే, భూభారతి దరఖాస్తులపై సమీక్షించి పలు సూచనలు చేశారు.