హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

భువనగిరి పట్టణంలోని బాగాయత్ స్కూల్‌లో చెట్టు కూలి మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కొంత ఆర్ధిక సాయం అందజేశారు. విద్యార్థిని మృతి పట్ల తన ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు. ఎంపీ వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ జనరల్ సెక్రటరీ పోత్నాక్ ప్రమోద్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.