హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వికలాంగుల హక్కుల సాధనకు పోరాటం ఉద్ధృతం: శంకర్

MHBD: కేసముద్రం పట్టణంలో శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెపాక శంకర్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ.. వికలాంగుల పింఛన్‌ను రూ. 4వేల నుంచి రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. చింతల రాములు తదితరులు పాల్గొన్నారు.