హైదరాబాద్: 28°C
తెలంగాణ

జేఎస్‌జేబీ పనులపై సీడబ్ల్యూసీ సంతృప్తి

SRPT: నడిగూడెం మండలంలోని నడిగూడెం, వేణుగోపాలపురం, ఈకేపేట్, రామాపురం గ్రామాల్లో చేపడుతున్న జేఎస్‌జేబీ పనులను కేంద్ర జల సంఘం నోడల్ అధికారి వి.గణేష్ ఇవ్వాళ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పనుల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.