NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై గల రుక్మిణి సత్యభామ సమేత శ్రీవారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారి మాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి కళ్యాణంలో కూర్చున్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశం పాల్గొన్నారు.
తెలంగాణ
కన్నుల పండుగగా వేణుగోపాలస్వామి మాస కళ్యాణం


