హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపల్లి కాల్వ నుంచి సాగునీరు విడుదల

NGKL: కొల్లాపూర్ మండలం పెద్దపల్లి కాల్వ నుంచి దిగువ గ్రామాలకు సాగునీరు విడుదల చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టి పెద్దకార్పముల, చిన్నకొత్తపల్లి, జగన్నాథపురం, యాపట్ల, చంద్రబండ తండా తదితర గ్రామాలకు నీరు అందేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఏఈ, సర్పంచ్ యాదగిరి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.