KRNL: దేవనకొండ మండలంలోని 44 గ్రామాల్లో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. దేవనకొండలో 6,390, తెర్నేకల్లో 4,377, పి.కోటకొండలో 5,179 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్లు అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
దేవనకొండలో బీసీ ఓటర్లే కీలకం.!


