హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా

SRD: సంగారెడ్డి పట్టణ రోడ్లపై చెత్త పారబోస్తే రూ.5 వేల జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. తడి, పొడి చెత్తను ఇళ్లలోనే వేరు చేసి మున్సిపల్ చెత్త బండికి అందించాలని సూచించారు. స్వచ్ఛ సంగారెడ్డి నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.