హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు బడుగులు సిద్ధం కావాలి'

కడప కార్పొరేషన్ పరిధిలోని 1 నుంచి 22వ డివిజన్లలో స్థానిక సంస్థల ఎన్నికలకు SC, ST, BCలు సిద్ధం కావాలని జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున పిలుపునిచ్చారు. శుక్రవారం కడపలో ఆయన మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, ప్రజా కూటమి తరఫున బడుగు వర్గాల అభ్యర్థులను బరిలో నిలబెడతామని తెలిపారు.