హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్పొరేట్ సంస్థలకు అనుమతులిచ్చింది రాచమల్లే'

KDP: ప్రొద్దుటూరులోకి బయటి నుంచి కార్పొరేట్ వ్యాపార సంస్థలను తీసుకొచ్చిందే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అని టీడీపీ నేత ప్రవీణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు ఎస్‌ఎస్‌ మాల్‌కు అనుమతులు ఇప్పించారని విమర్శించారు. రిలయన్స్, మ్యాక్స్, సీఎంఆర్, డీమార్ట్, తదితర సంస్థలు ఆయన హయాంలోనే అనుమతులు పొందాయని పేర్కొన్నారు.