హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పౌర్ణమితో బస్టాండ్లలో పెరిగిన రద్దీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు వెళ్తున్నారు. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. మహబూబ్‌నగర్-హైదరాబాద్, తాండూరు, నారాయణపేట మార్గాల్లో రద్దీ అధికంగా ఉంది.