హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ భూముల ప్లాట్ల విక్రయంపై ఆరోపణలు'

BHNG: చౌటుప్పల్‌ మండలంలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అనుమతులు లేకుండానే పంచాయతీల నుంచి పత్రాలు జారీ చేసి రిజిస్ట్రేషన్లకు మార్గం చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అనంతరం ఇంటి నంబర్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.