హైదరాబాద్: 28°C
తెలంగాణ

CM రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

WGL: CM రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీలు కట్టారు. CMకు రాఖీ కట్టేందుకు ఉదయమే అపాయింట్మెంట్ కోరిన సురేఖ కొద్దిసేపటి క్రితం రేవంత్ ఇంటికి చేరుకున్నారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎంకు రాఖీ కట్టారు. ఇటీవల సీఎంపై పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి సురేఖ అపాయింట్మెంట్‌పై తొలుత ఉత్కంఠ నెలకొంది