హైదరాబాద్: 28°C
తెలంగాణ

5 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి: బూర్గంపాడు మండలం గుమ్మూరు వద్ద శుక్రవారం వాహన తనిఖీల్లో 5 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుమ్మూరు, ఎన్‌పీ రెడ్డిపాలెం గ్రామాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని సీతారాంపురంలోని విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బియ్యంతోపాటు ఆటోను స్వాధీనం తీసుకొని బొల్లం వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.