హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే మురళి నాయక్‌కు రాఖీ కట్టిన సోదరి

MHBD: మహబూబాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరి సరోజిని ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ తనకు తోడుగా నిలుస్తాయన్నారు.