హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పండగ వేళ విషాదం

MDK: చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు పోతరాజు పోచయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ప్రస్తుతం జంగరాయి గ్రామపంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి భోజనం చేసి నిద్రించిన పోచయ్య.. నిద్రలోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. రాఖీ పండగ వేళ ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.