హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాఖీ వేళ ప్రయాణికులకు ఛార్జీల షాక్..!

KNR: రాఖీ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రూ.290 ఉన్న టికెట్ ధరను, రాఖీ పండుగనాడు రూ.400కు పెంచారు. స్పెషల్ బస్సుల పేరుతో 1:50 నిబంధనను వాడుకుంటూ అదనంగా రూ.100 నుండి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.