హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీకి గురైంది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగుడు గర్భాలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు. ఉదయం పూజారి గమనించడంతో విషయం వెలుగుచూసింది. ఆలయ కమిటీ ఫిర్యాదుతో ఆదిబట్ల పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో సరైన భద్రత కల్పించాలని భక్తులు కోరారు.