హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ జోగుళాంబ దేవికి 'లక్ష గాజుల' పూజ...!

MBNR: అలంపూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జోగుళాంబ అమ్మవారికి సెప్టెంబర్ 11న లక్ష గాజుల అలంకరణ పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా లక్ష గాజులతో అలంకరించనున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.