ADB: పట్టణంలోని వడ్డెర బస్తీలో దేశీదార్ విక్రయిస్తున్న వెంకట రమణను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజేందర్ తెలిపారు. నిందితుడి వద్ద రూ.9,920 విలువైన 90 మి.లీ. పరిమాణం గల 248 దేశీదార్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా దేశీదారు మద్యం రవాణా చేసిన, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
'దేశీదార్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్'


