ADB: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళలకు రక్షణ, గౌరవం కల్పించే బాధ్యతను ఈ పండగ గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన కోరారు.
తెలంగాణ
జిల్లా ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు: కలెక్టర్


