హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్తారంలో కుక్క మృతి.. కేసు నమోదు

ఖమ్మం: ముదిగొండ మండలం, ముత్తారంలో పెంపుడు కుక్క ఎయిర్‌గన్‌ కాల్పుల్లో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి వద్దకు కుక్క వస్తోందనే కారణంతో రౌతు జానయ్య కాల్పులు జరిపినట్లు కుక్క యజమాని ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాలతో ఏఎస్ఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.