హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగుళాంబ ఆలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం

GDWL: శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి, శ్రీ జోగుళాంబ అమ్మవారి మూలవిగ్రహాలతో పాటు శ్రీచక్రం ఫొటోలు, వీడియోలు తీయడంపై దేవస్థానం నిషేధం విధించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆలయ ఈవో దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు, అర్చకులు, మీడియా ప్రతినిధులు ఈ నిబంధనలు పాటించి దేవస్థానానికి సహకరించాలని కోరారు.