హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడెం దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం మంచిర్యాల జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుండి భక్తులు దేవాలయానికి భారీగా చేరుకున్నారు. సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. యజ్ఞశాలలో పలు జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తున్నారు.