హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ(M) కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరుకున్నారు.