NLG: కట్టంగూరు మండల కేంద్రంలో బోనాల పండుగ సందర్భంగా కోట మైసమ్మకు సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా బోనాల వేడుకలు జరుపుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఐకమత్యంగా కలిసి ఉండాలని సర్పంచ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా బోనాల పండుగ వేడుకలు


