హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలలో గుండెపోటుతో ఏఎస్ఐ కన్నయ్య మృతి

గద్వాల జిల్లాకు చెందిన ఏఎస్ఐ కన్నయ్య (50) తిరుమలలో గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, నిబద్ధతతో పేరు పొందిన కన్నయ్య మృతితో పోలీసు శాఖలో, నడిగడ్డ ప్రాంతంలో విషాదం నెలకొంది.