హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్పాలతో పోచమ్మ ఆలయానికి విశేష అలంకరణ

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల అందమైన పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో సందడి నెలకొంది.