హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో జంధ్యాల పౌర్ణమి వేడుకలు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పద్మశాలీలు వేదమంత్రాల నడుమ జంధ్యా ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.