హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారి పక్కన పొంచి ఉన్న ప్రమాదం..!

MNCL: జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామ శివారులో ఉన్న వాగు వంతెన వద్ద ప్రమాదం పొంచి ఉంది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వాగు సమీపంలోని ప్రధాన రహదారి భూమి కోతకు గురవుతోంది. రోడ్డుపై వాహనాలు వెళ్లే సందర్భంలో ఎదురుగా మరో వాహనం వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు వాపోయారు. వాహనాలు అదుపుతప్పి నేరుగా వాగులో పడిపోయే అవకాశం ఉంది.