తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను బెదిరించి, అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళం ప్రాంతంలోని డీకేటీ పట్టాను పక్కా పట్టాగా మారుస్తామని నమ్మించి రూ.40 వేల నగదు తీసుకున్న నిందితుడు, అనంతరం ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి ప్రవేశించి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్


