NTR: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఈవో వికె శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలు, భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా గిరిప్రదక్షిణ


