హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లి కొనాలంటే కన్నీళ్లే!

కోనసీమ: నెల రోజుల్లో ఉల్లి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కిలో రూ. 20–25 ఉన్న ఉల్లి ప్రస్తుతం శుక్రవారం రావులపాలెం రైతు బజార్‌లో రూ. 42, బహిరంగ మార్కెట్‌లో రూ. 60కు చేరింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధరల పెరుగుదలతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.