కోనసీమ: కాట్రేనికోన మండలం చిర్రయానాంలో రూ.1.50 కోట్లతో 2014లో నిర్మించిన బహుళార్థ సాధక తుఫాను భవనం నిరుపయోగంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరగా, ఆవరణలో పొదలు పెరిగిపోయాయి. కిటికీలు సైతం పాడైపోయాయని స్థానికులు తెలిపారు. భవనాన్ని వినియోగంలోకి తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపయోగంగా మారిన తుఫాను భవనం


