హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కర్నూల్‌లో హైదరాబాద్ ముఠా అరెస్ట్!

కర్నూలులో సంచలనం సృష్టించిన దొంగతనాల కేసును కర్నూలు 4వ టౌన్ సీఐ విక్రమ్ సింహ నేతృత్వంలో పోలీసులు ఛేదించారు. హైదరాబాద్కు చెందిన దొంగల ముఠాను గురువారం అదుపులోకి తీసుకొని, వారి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో 10కిపైగా దొంగతనం కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు.