హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంగిపోయిన రోడ్డు.. స్థానికుల ఆవేదన!

NDL: ఆళ్లగడ్డలోని కుద్భా వీధికి వెళ్లే ప్రధాన రహదారి భారీ వాహనాల రాకపోకలతో కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో రహదారి పరిస్థితి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు మరమ్మతులు చేపట్టి సురక్షిత రాకపోకలకు చర్యలు తీసుకోవాలని కోరారు.