ప్రకాశం: తర్లుపాడు మండలం నాగెళ్లముడిపి గ్రామ జెడ్పీహెచ్ పాఠశాలలో ఎస్సై బసవరాజు గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బాలికలకు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై వివరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై!


