హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువ పనులతో ప్రజలకు ఇక్కట్లు

ATP: తనకల్లులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కాలువ తీసి వదిలేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా నిర్మించిన మార్చురీ గదికి నీటి పైప్‌లైన్‌ వేసేందుకు 15 రోజుల క్రితం కాలువ తవ్వారు. రోడ్డుపై మట్టి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబులెన్సు కూడా వెనక్కిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాలువను పూడ్చి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని వైద్యాధికారి విజయ్ కుమార్ తెలిపారు.