హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గరుడ సేవ

CTR: పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడ సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గరుడ సేవ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.