హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు..!

KRNL: ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం సమయంలో బస్టాండ్‌లో భారీగా ప్రయాణికులు చేరుకున్నప్పటికీ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించడం ఏమిటని ప్రయాణికులు వాపోతున్నారు.