హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: కొత్తపేట మండలం పలివెల సెక్షన్ పరిధిలో విద్యుత్ మరమ్మతు పనుల నిమిత్తం కొత్తపేట మండలంలోని గంటి, పలివెల, చప్పిడివారిపాలెం గ్రామాలకు శుక్రవారం సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ కె. రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సరఫరా ఉండదని ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.